Friday, July 11, 2008

చాలా కాలం తరవాత ....

ఎప్పటినుంచో హైదరాబాదు చేక్కేద్దము అని ప్రయత్నించీ ప్రయత్నించీ ....ఏదో ఇప్పటికి హైదరాబాదు లో పడ్డాను. ఒక్క సారి ఈ హైటెక్ సిటీ ని చూద్దును కదా..(ఒక్క త్రాఫికార్ ని తప్పించి) ...ఒక అమెరికా నే తలపించింది. ఎవందోయీ. .ఇక్కడ కూడా ఎక్కువ ప్యాకేజీ ఇచ్చే చిన్న కంపెనీలు వున్నాయి. దీనమ్మ...(మనకి మాముల్గా వచ్చే బూతు) హైటెక్ సిటీ లో అప్పుడే పెట్టి ఇచ్చే 'టీ' అసలు దొరకదు. అన్ని డబ్బా టీ లే . మనకా..రోజు కి నాలుగు సార్లు టీ తాగే అలవాటు. ఇదేమీ ఖర్మ రా అనుకోవాల్సి వస్తుంది. ఈ హైటెక్ పార్క్ లో ఎక్కడ పట్టిన సాఫ్ట్వేర్ అమ్మాయిలే గానీ, కాలేజి అమ్మయిలు అసలు కనపడతల్లేదు.; ఛీ దీనమ్మ. (మళ్ళీ బూతు) ..ఇక కొండా పుర్..నాకు కొన్ని రోజులకి ఇచ్చిన వసతి గృహం. ఈ చోటు లో మంచి ఆంద్ర మెస్ లేదు. ఎక్కు వా రెస్టారెంట్ లే . ఆంధ్రా లో వుంటూ...ఆంధ్రమెస్ కోసం వెతికే ఓపిక లేక...కప్ నూడిల్స్ తిని కాలం వెళ్ళ దీస్తున్న. ఇంకా కొంత కాలం . ..నెక్స్ట్ కుటుంబం.

Monday, June 23, 2008

గరీబీ ...మన షకీలా...

హమ్మయ్య... మళ్ళీ సోమవారం ..పనికి పోవాలి అని హైదరాబాదు నుంచి బయలు దేరాము. మన లాలూ పుణ్యమా అని 'పేదవాడి రధం ' ( గరీబ్ రథ్ )లో ఎక్కి కూర్చున్నాము... నాతో పాటు మా సహచరులు కూడా వస్తున్నారు చిలుకూరు బాలాజీ ని చూసుకొని. .. అందరూ అలసి పోయి వున్నారు...కూ కూ అంటూ పొగ బండి కదిలింది... మా సహచరులందరూ ఒక చోట కూర్చుంటే... నేను వేరొక కూపే లో కూర్చో వలసి వచ్చింది...సరే అని సర్ది పెట్టుకున్నాము.
ఇంతలో...షకీల అలా వెళ్ళింది... అందరూ కన్నార్పకుండా చూస్తున్నారు... షకీల 'పేదవాడి రథం' లో ప్రయానిస్తున్నది అంటే...ఈ మల్లు (మలయాళీలు) గాళ్ళు షకీల డబ్బు అంతా లాక్కొని వేరే రాష్ట్రాలకి పంపించారు అని మేము తెగ బాధ పడిపోయాము.... ఈ మధ్య బొత్తిగా చిత్రాలు తగ్గిపోవడము వల్ల 'సన్న పడింది' అయినా పర్లేదు....చూడొచ్చు...ఒకసారి షకీలని . మా సహచరుడి కోరిక తీరలేదనుకోండి ...షకీలని చూసిన తరవాత.. (మీరు అపార్థం చేసుకోవొద్దు) అదే ..మా వాడు 'ఆటోగ్రాఫ్' తీసుకుందామని అనుకున్నాడట... కాని షకీల మాయమయిపోయింది... అంతే కదా..సినిమా జీవితం.
(మేము కూడా రెండు మార్లు అటు ఇటు తిరిగామనుకోండి...ఇంకొకసారి చూడటానికి అప్పటికే షకీల 'హుష్ కాకి' !!!

Thursday, June 19, 2008

పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్

కన్యాశుల్కం నాటకంలో నవ్వుల పంట పండించే పాత్ర గరీశానిది. ఇతర పాత్రల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని గిరీశం వదిలే ఢాంభికాలు మనల్ని మాత్రం కడుపుబ్బా నవ్విస్తాయి.చుట్టపై గరీశం ఏమంటాడంటే,
“చుట్టకాల్చడం యొక్క మజా నీకింకా బోధపడకపోవడం చాలా ఆశ్చర్యంగా వుంది. చుట్ట కాల్చబట్టే కదా దొర్లంత గొప్పవాళ్ళయినారు. చుట్టకాల్చని ఇంగ్లీషువాణ్ణి చూశావూ? చుట్టపంపిణీ మీదనే స్టీముయంత్రం వగయిరా తెల్లవాడు కనిపెట్టాడు. లేకపోతే వాడికి పట్టుబణ్ణా? శస్త్రకారుడు యేవన్నాడో చప్పానే.
సూత ఉవాచ-
ఖగపతి యమ్రుతము తేగా
భుగ భుగ మని పొంగి చుక్క
భూమిని వ్రాలెన్ పొగ చెట్టై జన్మించెన్
పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్
(ఇంద్రుడు స్వర్గానికి అమృతం తీసుకొనివస్తుండగా పొగలు కక్కుతున్న అమృత కలశం నుండి ఒక చుక్క క్రింద పడింది. ఆ అమృతబిందువు నుండి పొగచెట్టు, అనగా పొగాకు పుట్టింది. అట్టి పొగ త్రాగని వారు మరుజన్మలో దున్నపోతై జన్మిస్తారు . )

ఒంగోలు పదాలు (ఒంగోలు కి మాత్రమే పరిమితం)

ఈ టైటిల్ చూస్తే ఏదో వింతగా అనిపిస్తున్నది కదూ... కాని నిజం.. 'వంగ వోలు' కి రూపాంతరం అయిన 'ఒంగోలు' పేరు లో ఉన్న రాచ ఠీవి మరి ఏ ఊరికి కూడా రాదు. తెలుగు బాష లో ని పదాలు ప్రాంతానికి అనుగుణం గా మారుతూ వుంటాయి. నాకు ఊహ తెలిసిన నుంచి ఒంగోలు కి మాత్రమే పరిమితమయిన పదాలు కొన్ని ఇక్కడ చెప్పడం జరుగుతున్నది.

౧) ఉబ్బరు:ఇది సామాన్యం గా వాడుక బాషలో వాడే పదం. దీని అర్ధం 'ఏమీ లేదు' ,'బాగుండదు', 'పనికి మాలిన వాడు' అని. తక్కువ స్తాయిలో చెప్పడానికి దీనిని వాడతారు.
ఉదా: వాడు పెద్ద ఉబ్బరోడు మామా...
అది ఉబ్బరు.

౨) బూజింగు: దీనికి అర్ధం 'కాకమ్మ కధలు , అబద్దాలు చెప్పడము , లేని పోనీ కధలు చెప్పేవాడు ' అనే అందాలకి ఉపయోగిస్తారు.
ఉదా: బూజింగ్ కధలు చెప్పా వద్దు రా...
వాడు బూజర్ మామ

౩) టర్కీ: / జిమ్మి : అందమయిన అమ్మాయికి ముద్దు పేరు.
ఉదా: మామా...టర్కీ రా ఇది.

౪) కస్సాక్: దొంగ చూపులు చూసే కత్తి లాంటి 'ఫిగరు' కి మారు పేరు .
అరె రే ! వీడెవడు రా ఉత్త సత్తెకాలపు మనిషల్లే వున్నాడు చాందస భావాలు పోయేటట్లు లేవు అని మా మామ (రెడ్డి గారు, మనసు పలుకు' అనే బ్లాగ్లో వుంటాడు) అంటూ వుంటాడు . మరి నేను మరీ అంత సత్తెకాలం వాడ్ని కాదని నిరూపించుకోవాలి కదా....ఏమంటారు ? అందుకని నాకు నచ్చిన మరో 'తవిక' ఇది. దీన్ని చదివి మీరు వీడెవడో కమ్యుని ష్ట్ లేక రాడికేల్ అనుకుంటే తప్పు నాది కాదు ...మామ ది. అయినా నాలో కూడా కొంత అభ్యుదయ వాదం వున్నదనుకోండి. ఇది శ్రీ శ్రీ గారి కవిత్వం చదివిన దగ్గరినుంచి అలవాటయ్యింది . నా అభ్యుదయ వాదానికి ఇది ఒక మచ్చు తునక మాత్రమే.
భూతాన్ని,
యజ్ఞోపవీతాన్ని,
విప్లవ గీతాన్ని నేను.
స్మరిస్తే పద్యం,
అరిస్తే వాద్యం,
అనల వేదిక ముందు ఆసరా నైవేద్యం.
నేనొక దుర్గం,
నాదొక స్వర్గం,
అనర్గళం, అనితర సాధ్యం, నా మార్గం.