Thursday, June 19, 2008

పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్

కన్యాశుల్కం నాటకంలో నవ్వుల పంట పండించే పాత్ర గరీశానిది. ఇతర పాత్రల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని గిరీశం వదిలే ఢాంభికాలు మనల్ని మాత్రం కడుపుబ్బా నవ్విస్తాయి.చుట్టపై గరీశం ఏమంటాడంటే,
“చుట్టకాల్చడం యొక్క మజా నీకింకా బోధపడకపోవడం చాలా ఆశ్చర్యంగా వుంది. చుట్ట కాల్చబట్టే కదా దొర్లంత గొప్పవాళ్ళయినారు. చుట్టకాల్చని ఇంగ్లీషువాణ్ణి చూశావూ? చుట్టపంపిణీ మీదనే స్టీముయంత్రం వగయిరా తెల్లవాడు కనిపెట్టాడు. లేకపోతే వాడికి పట్టుబణ్ణా? శస్త్రకారుడు యేవన్నాడో చప్పానే.
సూత ఉవాచ-
ఖగపతి యమ్రుతము తేగా
భుగ భుగ మని పొంగి చుక్క
భూమిని వ్రాలెన్ పొగ చెట్టై జన్మించెన్
పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్
(ఇంద్రుడు స్వర్గానికి అమృతం తీసుకొనివస్తుండగా పొగలు కక్కుతున్న అమృత కలశం నుండి ఒక చుక్క క్రింద పడింది. ఆ అమృతబిందువు నుండి పొగచెట్టు, అనగా పొగాకు పుట్టింది. అట్టి పొగ త్రాగని వారు మరుజన్మలో దున్నపోతై జన్మిస్తారు . )

No comments: